ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మొగిలి శ్రీనివాస్

28-10-2026 | 04:28pm

మానకొండూరు, అక్టోబర్ 28 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన మొగిలి శ్రీనివాస్ ను బిజెపి ఎస్టి మోర్చా జిల్లా ప్రధానకార్యదర్శిగా నియమించినట్లు ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు రమావత్ శ్రీనివాస్ నాయక్  ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ,బిజెపి జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షులు రామావత్ శ్రీనివాస్ నాయక్ , బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి , సీనియర్ నాయకులు రంగు భాస్కరాచారి,  రాపాక ప్రవీణ్ , బిజెపి మానకొండూరు మండల అధ్యక్షులు కంది రాజీరెడ్డి లకు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ పటిష్టతకు తన శాయశక్తుల కృషి చేస్తానని శ్రీనివాస్ ఈ సందర్భంగా చెప్పారు.

మరిన్ని వార్తలు