బాధితుడిని పరామర్శించిన మైనార్టీ జిల్లా అధ్యక్షుడు అర్షద్‌ హుసేన్‌

28-10-2026 | 09:12pm

అక్టోబర్ 28 (విజయ క్రాంతి) బెజ్జూర్‌: మండలంలోని రేచిని గ్రామానికి చెందిన నికూరి మల్లయ్య కొద్ది రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి గాయపడ్డారు. విషయం తెలుసుకున్న మైనార్టీ జిల్లా అధ్యక్షుడు అర్షద్‌ హుసేన్‌(Minority District President Arshad Hussain) బుధవారం బాధితుడిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు