నషా ముక్త్ భారత్ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి
తంగళ్ళపల్లి నవంబర్ 26 (విజయ క్రాంతి):రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో(Tribal Welfare Women’s Degree College) రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మై భారత్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యువ సంవాద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ ఐకాన్ శ్రీనిత్య, స్పోర్ట్స్ ఐకాన్ ప్రశాంత్ తమ జీవిత ప్రయాణాలను విద్యార్థులతో పంచుకొని యువతకు స్ఫూర్తినిచ్చారు.
వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువత భాగస్వామ్యం కావాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ నషా ముక్త్ భారత్ నిర్మాణానికి కృషి చేయాలని మై భారత్ జిల్లా ప్రోగ్రామ్ అధికారి కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జైనా, వైస్ ప్రిన్సిపాల్ రహేనా, అధ్యాపకులు, వాలంటీర్లు పాల్గొన్నారు.