గోదావరిఖని లో 16 మంది రౌడీషీటర్ల బైండోవర్

26-11-2026 | 11:00pm
  1. ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష పూచీకత్తు.. ఏడాది పాటు సత్ప్రవర్తనతో ఉండాలని ఆదేశం
  2. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
  3. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరిక

గోదావరిఖని, నవంబర్ 26(విజయ క్రాంతి): రామగుండం పోలీస్ కమిషనరేట్(Ramagundam Police Commissionerate) పెద్దపల్లి జోన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 16 మంది రౌడీషీటర్లను గురువారం బైండోవర్ చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష చొప్పున పూచీకత్తు తీసుకొని ఏడాది పాటు సత్ప్రవర్తనతో ఉండాలని ఆదేశించారు.

గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ లింగమూర్తి ఆధ్వర్యంలో రౌడీషీటర్లను రామగుండం పోలీస్ కమిషనర్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్ అంబర్ కిషోర్ ఝా ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) సెక్షన్లు 126 నుంచి 136 ప్రకారం విచారణ నిర్వహించి బైండోవర్ ప్రక్రియ పూర్తి చేశారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి నేరాలకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పూచీకత్తు నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.లక్ష బాండ్ సొమ్మును జప్తు చేయడంతో పాటు చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని తెలిపారు. నేరప్రవృత్తి కలిగిన వ్యక్తులపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని పేర్కొన్నారు.

బైండోవర్ చేసిన వారి వివరాలు:

ఆకుల తిరుపతి – విఠల్‌నగర్, భీమా శ్రీకాంత్ – గాంధీనగర్, అన్నవేణి సాయితేజ – రాంనగర్,

చీమల శ్రీధర్ – ప్రశాంతినగర్, కొమ్ము ప్రసాద్ – లెనిన్‌నగర్, కొమురవెల్లి విశ్వనాథ్ – బాపూజీనగర్,

మేకల నాంపల్లి – ఉదయ్‌నగర్, గడ్డం సతీష్ – విఠల్‌నగర్,

బొబ్బల మహేష్ – తిలక్‌నగర్,

అడ్లూరి శ్రవణ్ కుమార్ – ఐబీ కాలనీ,

అవునూరి సురేష్ – తిలక్‌నగర్,

నల్లంగుల ప్రసాద్ – విఠల్‌నగర్, పొరండ్ల సతీష్ బాబు – చంద్రశేఖర్‌నగర్, జటోత్ సర్వేష్ – ఎల్‌బీనగర్

మహమ్మద్ జాకీర్ – హనుమాన్‌నగర్,

బొల్లి రమేష్ – ఎల్‌బీనగర్

ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, ప్రొబేషనరీ డీఎస్పీలు సీహెచ్. ఆదిశేషు రెడ్డి, మహమ్మద్ తాజుద్దీన్, బి. ఐశ్వర్య, దుగ్గిరెడ్డి హరిప్రియ, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ, వన్‌టౌన్ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ లింగమూర్తి, ఆర్‌ఐ రమేష్, ఎస్సైలు మనోహర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు