రబీ సాగేనా.. ఆరుతడి అయ్యేనా?
కరీంనగర్, అక్టోబరు 14 (విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో(Undivided Karimnagar district) రబీ సాగుపై(Rabi cultivation) సందిగ్ధత నెలకొంది. ఎల్ నినో ప్రభావం(Impact of El Niño) దృష్ట్యా రబీ సీజన్లో వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు సాగు(Cultivation of semi-dry crops) చేయాలని ప్రభుత్వం సూచిస్తుండగా సాగుపై రైతుల్లో ఆందోళన మొదలైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రబీ(యాసంగి) సీజన్లో సుమారు 11 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి. వరి 5,02,600 ఎకరాలలో, మొక్కజొన్న 35,000 ఎకరాలలో, నువ్వులు 11,000 ఎకరాలలో సాగు అవుతుంటాయి.
తెలంగాణ రాష్ట్ర రై తాంగానికి రైతు నేస్తం కార్యక్రమం(Raithu Nestham Program) ద్వారా ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఎల్ ని నో పరిస్థితుల దృష్ట్యా రబీ సీజన్లో రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయవద్దని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమా ర్క సూచించారు. ఎల్ నినో ముప్పు తీవ్రంగా ఉండటం, జలాశయాల్లో తగినంత నీరు చేరకపోవడంతో ఈ రబీలో వరి సాగు చేయవద్దని, ఎక్కువ నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఆరుతడి పంటలను ఎంచుకోవా లని ప్రభుత్వం రైతులకు సూచిస్తోంది.
వ్యవసాయ శాఖ అధికారులు ఉమ్మడి జిల్లావా ్యప్తంగా వరికి ప్రత్యామ్నాయంగా స్వల్పకాలిక పప్పుధాన్యాలు, కూరగాయల పంటల వైపు రైతులను మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కరీంనగర్, జగిత్యాల ప్రాంతాల్లో ప్రత్యేక శాస్త్రవేత్తల బృందాలు ఎంపిక చేసిన గ్రామాల్లో రైతులకు వాతావరణ మార్పులను తట్టుకునే పంటలపై అవగాహన కల్పిస్తున్నాయి.
నీటి ఎద్దడిని తట్టుకునే శనగలు, మినుములు, పెసలు వంటి విత్తనాలను 50% నుండి 100% వరకు సబ్సిడీతో అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా విత్తన పంపిణీ ప్రారంభమైంది. రైతులు నీటి లభ్యతను బట్టి, భూగర్భ జలాల ఆధారంగా మాత్రమే పంటల ప్రణాళిక వేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈసారి సాధారణ రబీ ప్రణాళిక (ముఖ్యంగా వరి సాగు) ఆశించిన స్థాయిలో సాగయ్య అవకాశాలు లేవు. ఎల్ నినో ప్రభావం, కరెంటు కోతలతో రైతన్నలు వరి నాట్లు వేయడం కష్టంగా మారే అవకాశం ఉంది.