ఎల్‌నినో మంటలు.. ఎండుతున్న పంటలు

15-10-2026 | 05:20am

పంట దిగుబడి పై సన్నగిల్లుతున్న రైతుల ఆశలు..

 ఉట్నూర్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ఖరీఫ్ పంటల సాగుపై(Kharif crop cultivation) ఎల్ ని నో ప్రభావం తీవ్రంగా ఉంది. వర్షా బావ పరిస్థితులపై ప్రభుత్వం జిల్లాల వారీగా కరువు పరిస్థితులపై వ్యవసాయ శాఖ పంటలపై పరిశీలన కొనసాగిస్తుంది. ఎల్ ని నో ప్రభావంతో(El Nino effect) తీవ్రంగా ఎండలు కాయడంతో చేతికి వచ్చిన పత్తి పంట(Cotton crop) పూత ఖాతా రాలిపోతుంది. ఇప్పటికే కాసిన కాయలు చెట్టుకు పది నుండి 20 వరకు ఉండడంతో పంట సాగుపై చేసిన ఖర్చులు చేతికి వందే విధంగా లేవంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సాగునీటి సౌకర్యం లేని రైతులు పంటను చూసి ఈసారి చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, సిరికొండ, ఆదిలాబాద్ రూరల్ మండలంలో ని వివిధ గ్రామాల్లో ఈ ఏడాది 1.35 లక్షల ఎకరాలలో పత్తి పంట సాగు చేశారు.

సెప్టెంబర్ నెలాఖరు వరకు పత్తి పంట ఏపుగా కాప్త పూతతో కళకళలాడిన పత్తి పంట అక్టోబర్ రెండో వారంలో తీవ్రమైన ఎండలకు పూత, పత్తి పిందెలు ఎండలకు నేల రాలిపోవడం తో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగుపై పెట్టిన పెట్టుబడి సైతం ఈసారి వచ్చే విధంగా లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పంటలపై పూర్తిస్థాయి సర్వే నిర్వహించి కరువు ప్రాంతంగా ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.

దిగుబడి రాదు..

ఇంద్రవెల్లి మండలం ఈసారి ఖరీఫ్ పంట సాగులో పది బ్యాగుల పత్తి విత్తనాలు విత్తుకున్నాను. ఎండలకు ఖాతా పూత రాలిపోతుంది. పది బ్యాగులకు 10 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే విధంగా లేదని ఆవేదనతో తెలిపారు. పంట సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. ఈసారి ప్రభుత్వమే ఆదుకోవాలి. గిరిజన ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని కోరుతున్నాం.

మడవి బీమ్ రావు, మారుతి గూడ

మరిన్ని వార్తలు