బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా సిద్ధం

15-10-2026 | 05:15am
  1. హైదరాబాద్ స్థానానికి డజన్‌కు పైగా ఆశవహులు
  2. వీరిలో రాంచందర్‌రావు కూడా!
  3. నల్లగొండ స్థానానికి ఇద్దరు, ముగ్గురి పేర్లే..
  4. నేడో రేపో కోర్ కమిటీ భేటీ... అధిష్ఠానానికి ప్రతిపాదన
  5. తనపోటీపై హైకమాండ్‌దే తుది నిర్ణయం: బీజేపీ రాష్ట్ర చీఫ్

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): తెలంగాణలో ఖాళీ అయిన రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు(Graduate MLC seat) బీజేపీ అభ్యర్థుల జాబితా దాదాపు సిద్ధమైంది. నేడోరేపో జరగనున్న కోర్ కమిటీ భేటీలో(Core committee meeting) ఈ జాబితాపై చర్చించి, అధిష్ఠానానికి మూడు పేర్లను ప్రతిపాదించనున్నట్లు సమాచారం. అయితే హైదరాబాద్- రంగా రెడ్డి-మహబూబ్‌నగర్(Hyderabad-Ranga Reddy-Mahabubnagar) స్థానానికి బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో డజనుకుపైగానే ఆశావాహులు ఉంటే నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్(Graduate MLC ticket) ఆశిస్తున్న వారిలో అతితక్కువ మంది ఉన్నారు.

ఎమ్మె ల్సీ అభ్యర్థుల ఎంపికపై నేతల నుంచి అభిప్రాయాలను తీసుకున్న త్రీమెన్ కమిటీ బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావుకి ఆ రెండు జాబితాలను అం దజేసింది. అత్యంత కీలకమైన హైదరాబాద్-రంగారెడ్డి -మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి ఏకంగా 15 మంది ఆశవాహుల పేర్లు ఉంటే.. నల్లగొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి ఇద్దరిముగ్గురి పేర్లు మాత్రమే ఉన్నట్లుగా తెలిసింది. హైదరాబాద్ స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేరు కూడా ఆ జాబితాలో ఉన్నట్లుగా తెలిసింది.

గతంలో ఇదేస్థానం నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన అనుభవం ఉండటంతో ఆయన పేరు ముందు వరుసలో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో పాటు మరో ఇద్దరు సీనియర్ నేత లు, ఒక విద్యావేత్త పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాను పోటీ చేసేది..లేనిది జాతీయ నాయకత్వానిదే తుది నిర్ణయమని రాంచందర్‌రావు చెప్తున్నారు. ఆయన ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉం డటంతో తనను బరిలో దింపితే ఎలా ఉంటుందని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక హైదరాబాద్‌కు భిన్నంగా నల్లగొండ గ్రాడ్యుయేట్ స్థానానికి మాత్రం పోటీ తక్కువగా ఉంది. ఈ స్థానానికి కేవలం ఇద్దరిముగ్గురి పేర్లు మాత్రమే తెరపైకి వచ్చాయి. ఒకరు పార్టీలో చాలా కాలంగా ఉన్న సీనియర్ నేత కాగా, మరొకరు ఇటీవల పార్టీలో చేరిన నాయకుడని సమాచారం. పార్టీ హైకమాండ్ ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని భావిస్తోంది.

గ్రాడ్యుయేట్ ఓటర్లలో బీజేపీకి ఉన్న పట్టు ను దృష్టిలో పెట్టుకుని, ఈ రెండు స్థానాల్లోనూ విజయం సాధించి మండలిలో బ లం పెంచుకోవాలని వ్యూహం రచిస్తోంది. నేడో రేపో పార్టీ కోర్ కమిటీ భేటీ కానుంది. తర్వాత ఫైనల్ అయిన మూడు పేర్లను ఢిల్లీకి పంపనున్నారు. అక్కడి నుంచి తుది ఆమోదం రాగానే అధికారి కంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు.

మరిన్ని వార్తలు