కాలుష్య కోరల్లో మనోహరాబాద్..!

15-10-2026 | 05:35am

పంట పొలాల సమీపాల్లో ఇండస్ట్రీస్‌లోని వ్యర్ధాలు

కాలుష్య నివారణకు చర్యలు తీసుకోలేని అధికారులు

మనోహరాబాద్, అక్టోబర్ 14 : గత 25 సంవత్సరాలుగా మనోహరాబాద్ మండలం(Manoharabad Mandal) ఇండస్ట్రీస్ ప్రాంతంగా(Industrial Area) ఏర్పడడం జరిగింది. నిజానికి మనోహరాబాద్ మండలాలలో ఉన్న గ్రామాలు పూర్తిగా కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతున్నాయని పలువురు ప్రజా సంఘాల వారు అనేక సందర్భాలలో నిలదీశారు. జాతీయ రహదారికి ఇరువైపులా చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు వ్యర్ధాలు వెదజల్తున్నాయి, పారిశ్రామిక ప్రాంతాలలో(Industrial areas) వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడవేసి ఎవరి లేని సమయంలో కాల్చి వేయడంతో పర్యావరణం పూర్తిగా కాలుష్య పొగతో కమ్ముకుపోవడం జరుగుతుంది.

కంపెనీల నుండి వచ్చు కాలుష్య వాయువులు(Polluting gases) గ్రామాలన్మిటిని  అతలాకుతలం చేస్తున్నాయి, గ్రామాల్లో నివసిస్తున్న ప్రజానీకానికి అనేక వ్యాధులు ప్రబలుతున్నాయి, చిన్నారులు వ్యాధి భారినపడి ప్రభుత్వ ఆసుపత్రులు చుట్టు తిరగడం జరుగుతుంది. వ్యవసాయ సంబంధిత ప్రాంతా లలో సైతం వ్యర్ధాలను తీసుకుపోయి వేయడంతో పంటలకు వ్యాధులు ప్రబలి సరైన స్థాయిలో పంటలు పండకపోవడంతో రైతులు అప్పల పాలవుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న పొల్యూషన్ అధికారులు ఎక్కడ సరైన క్రమంలో ఉద్యోగ బాధ్యతలను నిర్వహించడం లేదని తప్పు పట్టారు.

మనోహరాబాద్ మండలంలోని పారిశ్రామిక ప్రాంతాలలో ప్రతి ఒక్క శాఖ అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని ఈ సందర్భంగా సూచనప్రాయంగా తెలిపారు. మండల పరిధిలో ఉన్న ఇండస్ట్రీస్ ప్రాంతాలను పొల్యూషన్ అధికారులు పర్యావేక్షించి పారిశీలించి ఇండస్ట్రీస్ వారికి సరైన స్థాయిలో అవగాహన కల్పించాలి ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే కంపెనీకి సంబంధించిన వ్యవహారాలలో జోక్యం చేసుకొని కాలుష్య కారకాలైన అన్ని పరిశ్రమలలో ఉన్న వాటిపైన ఉన్నత పొల్యూషన్ అధికారులు చర్యలు తీసుకోవాలి.

మరిన్ని వార్తలు