అంగట్లో అంగన్వాడీ ఉద్యోగాలు
- అర్హత ఉన్న వారి నుంచే వసూళ్లు,?
- ఒక్కో పోస్టుకు రూ. లక్ష నుంచి రూ.3 లక్షలు వసూలు
- 10 మార్కులే కీలకం
- డీడబ్ల్యుఓ తీరుపై అభ్యర్థుల ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 14 ( విజయక్రాంతి): ఎన్నో ఏళ్లుగా మాతా శిశు సంక్షేమ శాఖలో(Maternal and Child Welfare Department) నియామకాలు లేకపోవడం, తాజాగా అంగన్వాడీ టీచర్లకు(Anganwadi teachers) ఆయాలకు ఏక కాలంలో భారీ మొత్తంలో పోస్టుల భర్తీకి(Filling of posts) నోటిఫికేషన్ వెలబడడం అధికారుల పాలట వరంగా మారిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అధీను అర్హతలు ఉన్న అభ్యర్థుల నుంచే అధికారులు ఒక్కో పోస్టుకు రూ 1 నుంచి 3 లక్షల వరకు వసూలు చేశారని ఆరోపణలు జిల్లా వ్యాప్తంగా దండిగా వస్తున్నాయి. ఎంపిక పారదర్శకంగా ఉండాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని అమలు చేసింది.
మెరిట్ ప్రాతిపదికన 90%, ఓరల్ ఇంటర్వ్యూ ద్వారా 10% మార్కులు తో ఎంపిక చేయాల్సి ఉంది. ఇంటర్వ్యూ 10 మార్కులే అధికారులకు కల్పతరువుగా మారాయని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో అభ్యర్థుల అర్హత అధికారులు ముందుగానే అధికారులకు తెలిసే అవకాశం ఉండటంతో ఎవరైతే ఎంపిక అయ్యే అవకాశం ఉందో ఆ అభ్యర్థులను టార్గెట్ చేసి వారి నుంచే వసూలు చేశారని విశ్వాసనీయ సమాచారం. జిల్లాలో అంగన్వాడీ నియామకాల భక్తి పూర్తికాకముందే పుంకాలు , పుంకాలుగా ఆరోపణలు వెలువడటంతో పాటు ఏకంగా ప్రజావాణిలోనే అభ్యర్థులు ఫిర్యాదులు చేయడం ఆరోపణలను ధ్రువపరుస్తుంది.
త్వరలోనే నియామకాల పూర్తయ్యే అవకాశం ఉందన్న ప్రచారం స్థానికంగా వినిపిస్తున్న నేపథ్యంలోనే కొందరు అభ్యర్థుల ఎంపికపై ముందస్తు అభ్యర్థులు వెలవ డుతున్నాయి. ప్రధానంగా సుజాతనగర్ దమ్మపేట బూర్గంపాడు మణుగూరు పాల్వంచ ప్రాంతాలకు చెందిన పలువురు అభ్యర్థులు గత సోమవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో వేరు,వేరుగా ఫిర్యాదులు చేయడమే కలకలం రేపుతోంది.
ప్రధానంగా మార్కులు, స్థానికత, నివాస ధ్రువీకరణ పత్రాల చెల్లుబాటు, ఇంటర్వ్యూల కు అభ్యర్థులను పిలిచే విధానం తదితర అంశాలపై అనేక అనుమానాలు, సందేహాలు తలెత్తుతున్నాయి. వస్తున్న ఆరోపణలు, సందేహాలను నివృత్తి చేయడంలో టి డబ్ల్యూ ఓ సరైన సమాధానం చెప్పకుండా దాటవేయడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అత్యధిక మార్కులు ఉన్నా అవకాశం లేనట్టే?
సుజాతనగర్ మండలం సర్వారం గ్రామపంచాయతీ పరిధిలోని ఒడ్డుగూడెం గ్రామా నికి చెందిన ఓ అభ్యర్థి ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించిన తనకు కాకుండా తనకన్నా తక్కువ మార్కులు వచ్చిన మరో అభ్యర్థిని ఎంపిక చేస్తున్నారనే అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేయడం గమనార్హం. భవిష్యత్తులో నీకు మంచి ఉద్యోగవకాశాలున్నాయి , మంచి భవిష్యత్తు ఉన్నదంటూ కారణాలు చెబుతూ తనకు వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని నిరాకరిస్తున్నారని ఆరోపించారు. జ్యోతి ఎంపిక జరిగితే తప్ప ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలు తేటతెల్లం కానున్నాయి.
స్థానికతపై అభ్యంతరం... ఇతర ప్రాంతాల అభ్యర్థులకు ఆహ్వానం
దమ్మపేట మండలం జగ్గారం గ్రామానికి చెందిన అంగన్వాడీ పోస్టు విషయంలో స్థానికత అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ పోస్టుకు పదిమంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో ముగ్గురు స్థానిక అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలవాల్సి ఉండగా, అధికారులు పక్కనే ఉన్న జగ్గారం తండాకు చెందిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలవటం స్థానికత అభ్యంతరం తలెత్తేందుకు అవకాశం ఏర్పడింది.
ఎక్కువ మార్కుల కారణం చూపుతూ స్థానికత నిబంధనలను అధికారులు తుంగలో తొక్కి నిబంధనలకు విరుద్ధంగా స్థానికేతరులకు ఉద్యోగ అవకాశం కల్పించేందుకు వారిని ఇంటర్వ్యూలకు పిలిచారని వారి ఆరోపించారు. ఉన్నతాధికారులు జగ్గారం, జగ్గారం తండాకు చెందిన స్థానికత నిబంధనలను పరిశీలించిన తర్వాతనే అభ్యంతరాలపై వాస్తవాలు తేలలున్నాయి.
డిగ్రీ అర్హత ఉన్నా ఇంటర్వ్యూకు పిలవలేదు
బూర్గంపాడు మండలం ఇరవైండి, కొత్తూరు ఆయా పోస్టులకు ఇద్దరు అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక అభ్యర్థి నివాస దృవీకరణ పత్రంలో కొత్తూరు గ్రామం పేరు లేదనే కారణంగా ఇంటర్వ్యూకు పిలవలేదనీ ఆరోపించారు. డిగ్రీ అర్హత ఉన్న తనను పక్కనపెట్టి పదో తరగతి అర్హత కలిగిన మరో అభ్యర్థిని మాత్రమే ఇంటర్వ్యూకి పిలవడంతో అభ్యంతరం తలెత్తింది. విద్యా అర్హతతో పాటు నివాస ధ్రువీకరణ పత్రాల ఆధారంగా అభ్యర్థుల అర్హతలను ఏ విధంగా నిర్ధారించారు, ఇద్దరు దరఖాస్తులు చేస్తే ఒక్కరినే ఎందుకు పిలవాల్సి వచ్చింది అనే అంశాలను పరిశీలించి న్యాయం చేయాలని ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
అర్హత కలిగిన వారి నుంచే వసూళ్ళు?
పోస్టులపై వస్తున్న ఆరోపణలు ఒక ఎత్తు అయితే, అంగన్వాడీ టీచర్లు సూపర్వైజర్లు సిడిపిఓలు మధ్యవర్తిత్వం వహిస్తూ అన్ని అర్హతలు కలిగి ఎంపిక అయ్యే అభ్యర్థులపై గురిపెట్టి వారి నుంచి వసూళ్లకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఒక్కో పోస్టుకు రూ 1 లక్ష నుంచి 3 లక్షల వరకు వసూలు చేశారనే సరికొత్త ఆరోపణలు వెలవడుతోంది. ఎంపిక అయిన అభ్యర్థి తాను డబ్బులు ఇచ్చానని చెప్పపదని, మెరిట్ ఆధారంగానే ఎంపీగా జరిగినట్లు బహిర్గతం చేయవచ్చునని పథకం ప్రకారమే ఎంపిక జరిగే అభ్యర్థులను టార్గెట్ చేసి వసూళ్లు మొదలు పెట్టారని విశ్వాసనీయ సమాచారం.
పూర్తి పారదర్శకతతో అభ్యర్థుల ఎంపిక
జిల్లాలో జరుగుతున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఎంపికలో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేదని, పూర్తిస్థాయిగా పారదర్శకంగా ఎంపిక జరుగుతోంది. అభ్యర్థుల ఎంపికపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారణమైనవి, అవాస్తవాలు. ఆన్లైన్ ద్వారా విద్యా అర్హతలు, స్థానికత ఆధారంగా మెరిట్ నిర్ణయిస్తామని, కేవలం 10 మార్కుల కోసమే ఇంటర్వ్యూ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అక్రమాలు జరగడానికి ఎలాంటి అవకాశం లేదన్నారు. అభ్యర్థుల ఎంపిక తుది జాబితా వెలువడక ముందే ఆరోపణలు చేయడం ఏమిటనీ ఆమె ప్రశ్నించారు.
సంక్షేమ అధికారిని లెనినా