భక్తుల కొంగు బంగారం

15-10-2026 | 05:30am
  1. ఏటా భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు 
  2. నూతన ఆలయ పుననిర్మాణ ధ్వజస్తంభ ప్రతిష్టాపన వేడుకలు
  3. చరిత్రక సజీవ జానపద కథనం

తిరుమల నాథ స్వామి క్షేత్రం.. భక్తులు ముద్దుగా పిలుచుకునే పేరు గుండు తిరుమలయ్య

రాజాపూర్ అక్టోబర్ 14: భారతీయ గ్రామీణ సంస్కృతిలో(Indian Rural Culture) జానపద కథలు, గ్రామ దేవతల ఆవిర్భావ(The emergence of village deities) గాథలు తరతరాలుగా నో టిమాట ద్వారానే నిలిచి ఉన్నాయి. ప్రతి పల్లెటూరిలోనూ(Village) శతాబ్దాల చరిత్ర కలిగిన ఆల యాలు, వాటి వెనుక తరగని భక్తి విశ్వాసా లు కనిపిస్తాయి. అలాంటి ఒక విశిష్టమైన జానపద విశ్వాసానికి, మూడు నాలుగు వందల సంవత్సరాల ప్రాచీన చరిత్రకు నిదర్శనమే మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండల పరిధిలోని చొక్కామ్ పేట్ గ్రామం లో వెలసిన తిరుమలనాథ స్వామి(Lord Thirumalanatha Swamy) (గుండు తిరుమలయ్య) దేవాలయం ఆవిర్భావ పై ప్రత్యేక కథనం.

మండలంలోని దొండ్లపల్లి ఉ మ్మడి గ్రామపంచాయతీ పరిధిలోని చొక్కా మ్ పేట గ్రామంలో తిరుమలనాథ స్వామి దేవాలయం(Tirumalanatha Swamy Temple) ఉంది. గతంలో పూర్వీకులు కట్టి న చిన్న ఆలయాన్ని పునరుద్ధరించేందుకు ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలందరూ కలిసి ఆలయపున నిర్మాణానికి కంకణం కట్టుకుని నూతన ఆలయాన్ని స్వా మివారికి కట్టారు.

అక్టోబర్ 14 నుండి 16వ తేదీ వరకు నూతన ఆలయ పున ప్రారంభం ధ్వజస్తంభ ప్రతిష్టాపన వంటి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలు తిలకించేందుకు జిల్లా నలుమూలల నుండి భక్తులు భారీ ఎత్తున తరలిరా నున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.

 ఆవిర్భావ నేపథ్యం - మహిమాన్విత కథనం 

ఈ క్షేత్రానికి సంబంధించిన పూర్వీకుల కథనం ప్రకారం సుమారు 300 నుండి 400 ఏళ్ల కిందట జరిగిన ఒక అద్భుత సం ఘటన ఈ ఆలయ స్థాపనకు బీజం వేసింది. అక్కడ పొలం పంట రక్షణ కొరకు ప్రాచీన కాలంలో రైతులు రాత్రివేళల్లో తమ పంట చేలను, బావుల దగ్గర ఉన్న పశువులను అడ వి మృగాల బారి నుండి రక్షించుకోవడానికి కాపలా కాసేవారు. రైతులు పగటిపూట పొ లం పనులకు ఉపయోగించే గుంటక పై ఒక రాయిని పెట్టి పనులు చేసేవారు. సాయం త్రం వేళ వ్యవసాయ పనిముట్లను ఎక్కడ విడిచిపెట్టినా, మరుసటి రోజు ఉదయానికి అవి గుండుతో సహా ఒకే నిర్దిష్ట స్థానానికి చే రుకుని కనిపించేవని పెద్దలు గమనించేవారు.

వెన్నెల రాత్రి జరిగిన అద్భుతం 

ఈ వింత ఏమిటో స్వయంగా పరిశీలించాలనే ఉద్దేశంతో ఒక వెన్నెల రాత్రి చెట్లపై కూర్చుని కావలి కాశారు. అర్ధరాత్రి 12 గం టల నుంచి 2 గంటల మధ్య నిశ్శబ్ద వాతావరణంలో ఎవరూ నెట్టకుండానే, ఒక పెద్ద రాతి గుండు వాటంతట అదే దొర్లుకుంటూ (దొర్లుకుంటా దొర్లుకుంటా) వచ్చి ఒక చెట్టు కింద నిలబడడం చూసి ఆశ్చర్యపోయిన రైతు. ఆ తర్వాత రైతులు గుండును అక్కడి నుంచి తరలించడానికి లేదా కదల్చడానికి ప్రయత్నించినా అది రాలేదు. ప్రకృతి ఒడిలోనే, స్థిరంగా నిలిచిపోయింది. దీంతో సాక్షాత్తు తిరుమలేశుడే ఇక్కడ వెలిశాడని ఇక్కడి ప్రజల అపారవిశ్వాసం.

 నామకరణం - ఆలయ నిర్మాణం 

ఈ విచిత్ర సంఘటన చూసిన గ్రామస్థులు, వంశపెద్దలు దీని వెనుక ఏదో దైవిక మహిమ దాగి ఉందని గ్రహించారు. పెద్దలు జ్ఞానులు, వేదపండితులు స్వామీజీలను సంప్రదించగా, ఆ బండ సాక్షాత్తూ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి (తిరుమలయ్య) అంశ అని, అది దైవ సంకల్పంతోనే అక్కడికి చేరిందని స్పష్టం చేశారు 

గుండు తిరుమలయ్యగా నామం

 స్వయంభువుగా దొర్లుకుంటూ వచ్చిన రాతి గుండు రూపంలో వెలసినందున స్వామివారికి గుండు తిరుమలయ్య అనే నామకరణం స్థిరపడింది.

రాతి గుడి నిర్మాణం

దాదాపు 300-400 ఏళ్ల క్రితమే పూర్వీకులు ఆ గుండు ను మమ్మల్ని రక్షించేందుకు వచ్చిన సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తుల అపారవిశ్వాసం. తిరుమలయ్య గుండు చుట్టూ భారీ రాళ్లతో ఒక ప్రాచీన గుడిని నిర్మించారు. ఇప్పటికీ ఆ పాత గుడి నిర్మాణ శైలి నాటి ప్రాచీన కళను, బలమైన రాతి నిర్మాణ పద్ధతులను ప్రతిబింబిస్తుంది. కుటుంబ, గ్రామీణ సంబంధాలు - వారసత్వంఈ దైవం ఇక్కడి ప్రాంత ప్రజల జీవితాల్లో, ముఖ్యంగా ఆ వంశీయుల సంస్కృతిలో ఎంతగానో కలిసిపోయింది.

తరతరాల పేర్ల సంప్రదాయం..

ఆ రైతుల కుటుంబంలో తాతలకు, నాయనలకు, చివరకు ఇంటి ఆడపడుచులకు (అమ్మమ్మలకు) కూడా తిరుమలయ్య పేరే పెట్టుకోవడం ఆ దేవునిపై వారికి ఉన్న అచంచలమైన భక్తిని చాటి చెబుతుంది.

గుండు తిరుమలయ్య గాథ కేవలం ఒక స్థానిక కథనం మాత్రమే కాదు; అది ఆ నేలతో, అక్కడి వ్యవసాయ జీవనంతో, ప్రజల అమాయక భక్తితో ముడిపడి ఉన్న 400 ఏళ్ల సజీవ సంస్కృతి. తరాలు మారుతున్నా, పూర్వీకులు అందించిన ఈ మహిమాన్విత గాథ నేటికీ సజీవంగా ప్రచారంలో ఉంటూ గ్రామ పల్లె సంస్కృతిని కాపాడుతోంది.

 ఎలా చేరుకోవాలి 

 రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుండి వచ్చే భక్తులు బెంగళూరు వెళ్ళు 44వ జాతీయ రహదారి పైగల రాజపూర్ మండల కేంద్రం చేరుకోవాలి. అక్కడినుండి సొంత వాహనాలు లేదా ఆటోల ద్వారా చొక్కామ్ పేట్ గ్రామం చేరుకోవచ్చు. ఈ ఆలయం వరకు మంచి రోడ్డు సౌకర్యం కలదు.

మరిన్ని వార్తలు