పేదలకు కేంద్రం మరింత భరోసా
- సామాజిక భద్రతకు మోదీ ప్రభుత్వం ప్రాధాన్యం
- రూ.53,428 కోట్లతో పీఎంఎస్ఎస్వైకి క్యాబినెట్ ఆమోదం
- దివ్యాంగుల పెన్షన్ అర్హత 40 శాతానికి తగ్గింపు
- హర్షం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): దేశంలోని పేద కుటుంబాలకు సామాజిక భద్రత(Social Security) కల్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి(Kishan Reddy) అన్నారు. నేషనల్ సోషల్ అసిస్టెన్స్(National Social Assistance) ప్రోగ్రామ్(ఎన్ఎస్ఏపీ) కార్యక్రమాన్ని పునర్వ్యవస్థీకరించి, ‘ప్రధానమంత్రి సామాజిక సహాయత యోజన’(పీఎంఎస్ఎస్వై)గా మార్చిందన్నారు. బుధవారం జరిగిన కేంద్ర క్యాబినెట్లో ఈ పథాకిన్న 2026--27 నుంచి 2030--31 వరకు అంటే రానున్న ఐదేళ్లపాటు రూ53,428 కోట్ల వ్యయం తో కొనసాగించేందుకు ఆమోదం తెలపడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్ అర్హతలను సడలించడం, సహాయ మొత్తాన్ని పెంచడం, మరింతమందిని పథకం పరిధిలోకి తీసుకురావడం.. సామాజిక భద్రతను విస్తరించే దిశగా మోదీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. దీంతో ప్రస్తుతం 3 కోట్లున్న వివిధ సామాజిక పథకాల లబ్ధిదారుల సంఖ్య.. ఇప్పుడు 3.2 కోట్ల మంది లబ్ధిదారులకు పెరగనుందన్నారు.
ఇది కాకుండా.. ఎన్ఎస్ఏపీ పేరును ‘ప్రధానమంత్రి సామాజిక్ సహాయతా యోజన’గా.. జాతీయ వృద్ధాప్య పింఛన్ పథకాన్ని ‘ప్రధానమంత్రి విధవస్త పెన్షన్ యోజన’గా.. జాతీయ వితంతు పెన్షన్ పథకాన్ని ‘ప్రధానమంత్రి విధవా పెన్షన్ యోజన’గా, జాతీయ దివ్యాంగుల పెన్షన్ పథకాన్ని.. ‘ప్రధానమంత్రి దివ్యాంగ్జన్ పెన్షన్ యోజన’గా జాతీయ కుటుంబ సహాయ పథకాన్ని ‘ప్రధానమంత్రి పరివార్ లాభ్ యోజన’గా కేంద్ర క్యాబినెట్ మార్పు చేసిందన్నారు.
పెన్షన్లలో భారీ సంస్కరణ
ఇప్పటివరకు కనీసం 80 శాతం వైకల్యం ఉన్నవారికి వర్తించిన పెన్షన్ను, ఇకపై 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి కూడా వర్తించేలా మార్పులు జరిగాయని కిషన్రెడ్డి తెలిపారు. దివ్యాంగుల పెన్షన్ 25 శాతం పెంచడం శుభపరిణామమన్నారు. వైకల్యంతో పుట్టిన చిన్నా రి సంరక్షణ బాధ్యత మొదటి రోజు నుంచే కుటుంబంపై ఉంటుందని తెలిపారు. అందుకే పెన్షన్ కోసం 18 ఏళ్లు వచ్చే వరకు వేచి ఉండాల్సిన ని బంధనను తొలగించాంమని, పుట్టినప్పటి నుంచే సహాయం అందించేలా మార్పు చేశామని తెలిపారు.
చిన్నారికి 18 ఏళ్లు వచ్చే వరకు ఈ సహా యాన్ని తల్లిదండ్రుల ద్వారా అందుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా.. ప్రస్తుతం 8.33గా ఉన్న దివ్యాంగుల పెన్ష న్ లబ్ధిదారుల సంఖ్య 27.48 లక్షలకు పెరగనుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.290 కోట్ల వార్షిక వ్యయం అవుతుండగా.. ఇకపై ఇది రూ.1,268 కోట్లకు చేరుతుందన్నారు. అటు.. వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, కుటుంబ సహా య పథకాల పేర్లు మారినప్పటికీ, వాటి అర్హతలు, కేంద్ర సహాయ మొత్తాలు, లబ్ధిదారుల పరిమితుల్లో మార్పు లేదు.
కేంద్ర ప్రభుత్వం అందించే సహాయానికి అదనంగా.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ సొంత నిధులతో అందించే అదనపు పెన్షన్ సహాయం దీనికి వేరుగా ఉంటుందని పేర్కొన్నారు. రూ.53,428 కోట్లను వచ్చే ఐదేళ్లలో ఈ అంశాలపై ఖర్చుచేయనున్నా రని తెలిపారు. తెలంగాణలోనూ ప్రస్తుతం కేంద్రప్రభుత్వ సామాజిక భద్రత పథకాల లబ్ధిదారుల సంఖ్య 7.28 లక్షలు కాగా.. తాజా మార్పులతో ఇది మరింతగా పెరగనుందని చెప్పారు. మోదీ ప్రభుత్వం గత 12 ఏళ్లుగా.. రూ.2,132 కోట్లను ఆయా పథకాల లబ్ధిదారుల అకౌంట్లలోకి నేరుగా బదిలీ చేసిందన్నారు.