SIR అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ
15-10-2026 | 07:00am
ఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుండటంతో, నేటి పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.