న్యాయవాదులకు మెడ్‌సేవా హామీ

24-11-2026 | 03:39pm

ముకరంపుర, నవంబర్ 24(విజయ క్రాంతి): న్యాయవాదులకు ఆరోగ్య భీమా కార్డుల(Health Insurance Card) సవరణలు, కుటుంబ సభ్యుల పేర్ల చేర్పునకు మేడ్ సేవ హామీ ఇచ్చింది.ఫెడరేషన్ ఆఫ్ లీగల్ ప్రొఫెషనల్స్ అధ్యక్షులు దిలీప్ చౌదరి తాళ్లూరి, రంగారెడ్డి కోర్టుల న్యాయవాది,

టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ శశికాంత్ మధుపు కలిసి న్యూఢిల్లీలోని మెడ్‌సేవా హెల్త్ ఇన్సూరెన్స్ టిపిఎ లిమిటెడ్ కార్యాలయాన్ని సందర్శించి, తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని న్యాయవాదుల ఆరోగ్య బీమా కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల చేర్పు, తప్పుల సవరణలు తదితర అంశాలపై అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన మెడ్‌సేవా ఆపరేషన్స్ హెడ్, పిల్లల పేర్లను పాలసీ మధ్యంతర కాలంలో చేర్చుకోవచ్చని, జీవిత భాగస్వామి పేరును పాలసీ రెన్యువల్ సమయంలో చేర్చుకోవచ్చని హామీ ఇచ్చారు. పెండింగ్ దరఖాస్తులు, కార్డుల సవరణల పరిష్కారానికి మెడ్‌సేవా హైదరాబాద్ బ్రాంచ్‌ను సంప్రదించాలని సూచించారు.ఈ సందర్భంగా దిలీప్ చౌదరి  మెడ్‌సేవా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు