బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్కు ఎంపికైన అశ్విక
కొత్తపల్లి , నవంబర్ 20(విజయక్రాంతి): తెలంగాణ పాఠశాల క్రీడా సమాఖ్య(Telangana School Games Federation) ఆధ్వర్యంలో నిర్వహించనున్న యస్.జి.ఎఫ్.ఐ. 70వ తెలంగాణ బాస్కెట్ బాల్(Telangana Basketball) అండర్-14 పోటీలకు కరీంనగర్ పట్టణం పద్మనగర్లోని పారమిత హెరిటేజ్ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని యన్.అశ్విక ఎంపికకావడం జరిగింది.
ఇటీవల కరీంనగర్ లో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ పోటీలలో 9వ తరగతికి చెందిన యన్.అశ్విక బాలికల అండర్-14 విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యింది. ఈ నెల 21 నుండి 23 వరకు ఖమ్మం జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలలో ఎంపిక కావడం జరిగింది.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని ని పాఠశాల చైర్మన్ డా. ఇ. ప్రసాదరావుతో పాటు డైరెక్టర్లు ప్రసూన, అనూకర్ రావు, రశ్మిత, రాకేశ్, వి.యు.యం. ప్రసాద్, వినోద్ రావు, ప్రధానోపాధ్యాయులు గోపీకృష్ణ అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కె. హన్మంతరావు, సమన్వయకర్తలు రబీంద్రపాత్రో, వ్యాయామ ఉపాధ్యాయులు యస్. రాజు, సాజన్ పాల్గొన్నారు.