చాకరిమెట్లలో వైభవంగా కార్తీక దీపోత్సవం
21-11-2026 | 12:06am
శివంపేట్ నవంబర్ 20 (విజయక్రాంతి ): మండల పరిధిలోని చిన్నగొట్టిముక్కుల గ్రామపంచాయతీ(Chinnagottimukkula Grama Panchayat) పరిధిలో ఉన్న చాకరిమెట్ల స్వయంభూ శ్రీ సహకార ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం కార్తీక దీపోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో(devotional) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని దీపాలతో అలంకరించగా, దీపాల వెలుగులతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు(Devotees) దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ఆంజనేయ శర్మ, ఈవో సారా శ్రీనివాస్, రాజ్య ప్రభు శర్మ, రమేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు.