పట్టభద్రుల ఓట్లే లక్ష్యంగా శ్రీకాంత్ గౌడ్ విస్తృత ప్రచారం

20-11-2026 | 11:47pm

కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల్లో ఓటర్లను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి...

ఆలేరు, నవంబర్ 20 (విజయక్రాంతి): ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం(Undivided Nalgonda, Warangal, Khammam) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో(Graduate MLC Election) తెలంగాణ రక్షణ సేన అభ్యర్థి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ గెలుపే లక్ష్యంగా జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రక్షణ సేన ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ(Aleru Assembly Constituency) ఇంచార్జి చందుపట్ల సుజిత్ రావు ఆధ్వర్యంలో, ఉమ్మడి మూడు జిల్లాల ఇంచార్జి సయ్యద్ ఇస్మాయిల్ పర్యవేక్షణలో ఈ ప్రచార కార్యక్రమం కొనసాగింది.

జిల్లాలోని వివిధ కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టు ప్రాంగణాలను సందర్శించిన డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ పట్టభద్రులైన ఓటర్లను నేరుగా కలిసి మద్దతు కోరారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు ఎన్నికల బరిలో నిలిచిన తాను గెలుపొందితే పట్టభద్రుల సంక్షేమం, నిరుద్యోగులు, విద్యావంతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వివరించారు. పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రచార కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు తంగళ్లపల్లి శ్రీకాంత్, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, ఖమ్మం పార్లమెంట్ ఇంచార్జి అనిత, జిల్లా నాయకులు ఆకుల నరేష్, తుంగతుర్తి సంతోష్, మంచాల సంతోష్, చిన్నం ప్రభాకర్, పండు, భాను, సాగర్, వెల్దుర్తి సాయినాథ్, రసాల రణధీర్, బోడ వెంకటేశ్, సతీష్, సునీల్, విష్ణు తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు