సివిల్ సప్లై కమిషనర్‌తో రైస్ మిల్లర్ల భేటీ
21-11-2026 | 12:01am
మహబూబాబాద్: సివిల్ సప్లై కార్పొరేషన్(Civil Supplies Corporation) నూతన కమిషనర్ గా నియమితులైన వై. నాగిరెడ్డిని మహబూబాబాద్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓలం కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి నాళ్ల వెంకటేశ్వర్లు, కోశాధికారి చిల్లంచర్ల సతీష్ తదితరులు నాగిరెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.