జీనియస్ క్వెస్ట్ క్విజ్ విజేతలు వీరే
స్వేచ్ఛ,కె. జ్యోత్స్న,ఎండీ జోయా బేగం..
శివంపేట నవంబర్ 20 ( విజయక్రాంతి ): మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్(Medak District Collector Pratima Singh) ఆదేశాల మేరకు శివంపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో(ZPHS Shivampet) మండల స్థాయి జీనియస్ క్వెస్ట్ క్విజ్ పోటీలు(Mandal-level Genius Quest Quiz Competitions) ప్రధానోపాధ్యాయులు బాలచంద్రం అధ్యక్షతన నిర్వహించారు. ఈ పోటీల్లో కేజీబీవీ శివంపేటకు చెందిన స్వేచ్ఛ (8వ తరగతి),గోమారం పాఠశాలకు చెందిన కె. జ్యోత్స్న (10వ తరగతి), చిన్నగొట్టిముక్ల పాఠశాలకు చెందిన ఎండీ జోయా బేగం (9వ తరగతి), విజేతలుగా నిలిచి ఈ నెల 26న మెదక్‌లో జరిగే జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విజేతలను ఎంఈఓ బుచ్చ నాయక్, ఉపాధ్యాయులు అభినందించారు. జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి రూ.90 వేలు, ద్వితీయ బహుమతి రూ.60 వేలు, తృతీయ బహుమతి రూ.30 వేలు కలెక్టర్ ప్రకటించారు.