‘ఖేత్ బచావో అభియాన్’పై రైతులకు అవగాహన
ఎరువుల సమతుల్య వినియోగం, పంట మార్పిడితో అధిక దిగుబడులు సాధించాలి
మహమ్మదాబాద్, నవంబర్ 20 విజయక్రాంతి: మండల పరిధిలోని ముకర్లబాద్: వ్యవసాయ శాఖ(Department of Agriculture) ఆధ్వర్యంలో ‘ఖేత్ బచావో అభియాన్’(పొలాన్ని రక్షించుకుందాం) కార్యక్రమంలో భాగంగా గ్రామంలో రైతులకు(Farmers') ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ భూసారాన్ని కాపాడుకోవడం, ఎరువుల సమతుల్య(Balanced fertilizers) వినియోగం, నానో యూరియా వాడకం, యాసంగిలో ఆరుతడి పంటల సాగు, పంట మార్పిడి వంటి పద్ధతులను రైతులు అలవర్చుకోవాలని సూచించారు.
రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ తక్కువ పెట్టుబడితో అధిక నాణ్యమైన దిగుబడులు సాధించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మి మైబయ్య, మండల ప్రత్యేక అధికారి,ఎంపీడీవో నరేందర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి నరేందర్, వ్యవసాయ విస్తరణ అధికారి నికిత, పంచాయతీ కార్యదర్శి, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.