అర్హులందరూ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

20-11-2026 | 11:57pm

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక భరోసా

వచ్చే నెల 18 వరకు దరఖాస్తుల స్వీకరణ

రేషన్ కార్డు లేనివారు సైతం పథకానికి అర్హులే

కుటుంబంలో సంపాదించే ఒకరికి బీమా వర్తింపు.

 కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్.

కొత్తగూడెం : టౌన్ నవంబర్ 20 (విజయ క్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని(Indiramma Family Life Insurance Scheme) సద్వినియోగం చేసుకోవాలని కొత్తగూడెం కార్పొరేషన్(Kothagudem Corporation) పరిధిలోని 14వ, 20వ డివిజన్లలో శుక్రవారం ఏర్పాటు చేసిన పథకం నమోదు శిబిరాలను ఆయన సందర్శించి ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఉచిత జీవిత బీమా భరోసా లభిస్తుందని తెలిపారు.

18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల కుటుంబంలోని సంపాదించే ఒక ప్రధాన వ్యక్తికి ఈ బీమా వర్తిస్తుందన్నారు. గీత, నేత కార్మికులు, మత్స్యకారులకు ఉన్న రూ.2 లక్షల బీమాను సైతం రూ.5 లక్షలకు పెంచడం జరిగిందని వివరించారు. ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఈ పథకం అమలవుతుందన్నారు. రేషన్ కార్డు ఉన్నవారితో పాటు లేని కుటుంబాలు కూడా ప్రత్యేక దరఖాస్తు ఫారం ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు.

నవంబర్ 19న ప్రారంభమైన ఈ ప్రక్రియ డిసెంబర్ 18 వరకు వార్డు కార్యాలయాలు, ప్రత్యేక శిబిరాలు, ఇంటింటి సర్వే ద్వారా కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఆధార్ కార్డు, నామినీ వివరాలు, ఫోన్ నంబర్‌తో విధిగా దరఖాస్తు చేసుకోవాలని, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రందాయాల చైర్మన్ వీరబాబు, కార్పొరేటర్ సుధాకర్, కార్పొరేషన్ అధికారులు విజయానంద్, సత్యనారాయణ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు