ఇందిరమ్మ భీమా కుటుంబానికి ధీమా

27-11-2026 | 06:52pm

ముకరంపుర, నవంబర్ 27(విజయ క్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ కుటుంబ భీమా పథకంలో(Indiramma Family Insurance Scheme) అర్హులైన ప్రతి ఒక్కరూ సంబంధిత వార్డు మరియు గ్రామ కార్యాలయాల వద్ద నమోదు చేసుకోవాలని నరేందర్ రెడ్డి(Narender Reddy) సూచించారు. కేఎన్ఆర్ మార్నింగ్ వాక్(KNR Morning Walk) లో భాగంగా కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో(Satavahana University, Karimnagar) వాకర్స్ తో కలిసి వాకింగ్ చేస్తూ అందరినీ పలకరిస్తూ ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం గురించి వివరిస్తూ ముందుకు సాగారు.

ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ధీమా అని తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.వివిధ కాలనీలలో నుండి వచ్చిన వాకర్స్ వారి వారి కాలనీలకు సంబంధించిన పలు సమస్యలను నరేందర్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ పర్వతం మల్లేశం,గుండాటి శ్రీనివాస్ రెడ్డి, నర్సింగం,కనకాచారితో పాటు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు