ఇచ్చిన హామీలను అమలుపర్చాలి

29-09-2026 | 09:51pm

కొత్తపల్లి, సెప్టెంబర్ 29(విజయక్రాంతి):విద్యార్థులు, రైతులు, వివిధ సామాజిక వర్గాల అభ్యున్నతికి ఎన్నికల మేనిఫెస్టో లో(Election manifesto) పీసీసీ అధ్యక్షుడి హోదాలో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections)ముందు హామీ ఇచ్చి అధికారం లోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి హామీల అమలులో నిర్లక్ష్యం చేయడం తగదని ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని ఓసీ, రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టి 33 నెలలు పూర్తి చేసుకొని కరీంనగర్ పర్యటన కు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కి ఇదే జిల్లాకు చెందిన ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు  పోలాడి రామారావు ఆయనకు ప్రజా సంఘాల తరపున  బహిరంగ లేఖ రాశారు.

ఈ మేరకు మంగళవారం కరీంనగర్ లో లేఖ ప్రతులను పాత్రికేయులకు పోలాడి రామారావు అందజేసి మాట్లాడుతూ విద్యార్థులకు ఉద్యోగాల కల్పన లో, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదలలో ,స్కాలర్ షిప్ స్టయిఫాండ్ ఇవ్వడం లోప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందనిఆరోపించారు. నిరోద్యోగ భృతి ఊసే లేదని, తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరిట 105 ప్రభుత్వ పాఠశాలలను మూసి వేయడం తగదన్నారు.

ప్రభత్వ పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ లో విలీనం చేసే జీ వో నెంబర్ 97 ను తక్షణమే రద్దు చేయాలని,రైతులకు ఏడాదికి ఎకరానికి 15 వేలు రైతు బంధు ఇస్తామన్నా హామీ అమలుకు నోచుకోలేదని, రుణమాఫీ పథకం లో మిగిలిపోయిన అర్హులైన 30 శాతం మంది రైతులకు రుణమాఫీ చేయలేదని ,రైతు భీమా అమలు లేదని,అన్ని రకాల దాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామన్న హామీ లో 

కేవలం సన్న రకాలకే పరిమితం చేశారన్నారు.గత పంట కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యం చేయడం తో ప్రైవేట్ దళారులు ప్రవేశించి రైతులను నిలువు దోపిడీకి గురించేశారని వచ్చే పంట కొనుగోళ్లలో పునరావృతం కాకుండా దాన్యాన్ని సకాలంలో ప్రభుత్వమే నేరుగా మద్దతు ధరతో కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పిల్లర్లను తక్షణమే మరమ్మత్తు చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఎస్ ఆర్ ఎస్ పి ద్వారా నీళ్లు విడుదల చేసి చెరువు కుంటలను నింపాలని డిమాండ్ చేశారు.

వివిధ ఓసీ సామాజిక వర్గాల పేదల సంక్షేమానికి ప్రతేక కార్పొరేషన్ లు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం పూర్తి స్థాయి పాలక మండల్లు ఏర్పాటు చేయలేదని నిధులు కేటాయించలేదని , రెడ్డి కార్పొరేషన్ కు అసలు పాలక మండలి నేటికీ ఏర్పాటు చేయలేదని మండి పడ్డారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విదేశీ విద్య కు అందించే ఓవర్సీస్ పథకంలో అవకాశం కల్పించడం లేదన్నారు. వివిధ రెసిడెంషియల్ కాలేజీ ల్లో, పాఠశాలల్లో ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అధికార్లు అమలు చేయడం లేదన్నారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు మిగతా వారి వలె జిల్లా కొకటి రెసిడెన్షియల్ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.అన్ని విభాగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లను పటిష్టంగా అమలు చేయడానికి ఒక ఐఏఎస్ అధికారి  పర్యవేక్షణలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

కరీంనగర్ బ్రాండ్ ఇమేజ్ ని కాపాడాలని మానేరు నదికి ఇరువైపుల నిర్మిస్తున్న నిలిచిపోయిన రివర్ ఫ్రంట్ పనులను యధా తతంగా వేగవంతం చేస్తు,గతం లో పర్యాటకులను విపరీతంగా ఆకర్శించిన తీగల బ్రిడ్జి వంతెన పరిసర ప్రాంతం నేడు ఆసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ,తీగల వంతెన పైకనీసం లైట్లు కూడా వెలిగించడం లేదన్నారు. ఎల్ ఎం డి ప్రాజెక్ట్ సమీపాన ఉన్న ఐటీ టవర్స్ లో కంపెనీలు లేక బోసిపోతున్న  ఐటీ టవర్స్ ను పాలకులు పట్టించుకోక పోవడం తో నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు.

కరీంనగర్ మున్సిపల్ లో విలీనం అయిన శివారు ప్రాంతాల మౌలిక సౌకర్యాల అభివృద్ధి నోచుకోవడం లేదన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ రోడ్లు మరమ్మతులకు నోచుకొక అద్వాన్నంగా ఉన్నాయన్నారు. రాష్ట్రం లో విచ్చలవిడిగా వెలిసిన మద్యం బెల్ట్ షాప్ లను కట్టడి చేసి బార్ అండ్ రెస్టారెంట్ లను, మద్యం షాప్ లను ఇష్టానుసారంగా పెంచకుంగా చూడాలని ,బతుకమ్మ చీరలను నేతన్న ల వద్దే కొనుగోలు చేసి సకాలంలో మహిళలకు అందించాలని,

ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో  ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఆయా గ్రామ పంచాయతీ సర్పంచులకు అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ కు రాసిన లేఖ ద్వారా విజ్ఞప్తి చేసినట్లు పోలాడి రామారావు తెలిపారు. బహిరంగ 

లేఖ పై సంతకం చేసిన వారిలో జాతీయ సలహా దారు పెండ్యాల కేశవ రెడ్డి,రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చెన్నామనేని పురుషోత్తమరావు,చందుపట్ల నర్సింహారెడ్డి, పెండ్యాల రాంరెడ్డి, బుస్సా శ్రీనివాస్,ఉమ్మడి జిల్లా నాయకులు బీరెడ్డి కరుణాకర్ రెడ్డి,తాటిపల్లి రాజన్న,డాక్టర్ దీపక్ బాబు, కొత్త కొండ రవీందర్ రావు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు