మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్య

29-09-2026 | 09:53pm

చేగుంట సెప్టెంబర్ 29,విజయక్రాంతి : మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేగుంట మండలంలోని వడియారం శివారులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కామారెడ్డి రైల్వే పోలీసుల కథనం ప్రకారం వడియారం గ్రామానికి చెందిన కృష్ణ (48) భార్యా పిల్లలు నిజాంబాద్ లో ఉంటున్నారు. మద్యం కు బానిసైన కృష్ణ, సోమవారం రాత్రి గ్రామ శివారులోని రైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపారు.

మరిన్ని వార్తలు