పాపన్నపేటకు చెందిన నిజామొద్దీన్‌కు ఆర్థిక సాయం
29-09-2026 | 09:46pm
పాపన్నపేట,సెప్టెంబర్29:పాపన్నపేటకు చెందిన నిజామొద్దీన్‌కు కాలికి శస్త్రచికిత్స చేయించుకునేందుకు రూ.75 వేల ఎల్వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరైంది. ఆర్థిక ఇబ్బందులతో చికిత్సకు ఇబ్బంది పడుతున్న నిజామొద్దీన్‌కు ప్రభుత్వం(Government) నుంచి ఎల్వోసీ మంజూరు కావడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కాలికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో చికిత్స కోసం ఎల్వోసీకి దరఖాస్తు చేసుకోగా రూ.75 వేల విలువైన ఎల్వోసీ మంజూరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, సహకరించిన మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు, డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, పార్టీ మండల అధ్యక్షులు నరేందర్ గౌడ్, జిల్లా మైనారిటీ అధ్యక్షులు సుఫీ, మైనార్టీ మండల అధ్యక్షులు ఖలీం, అధికారులకు నిజామొద్దీన్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.