ప్రతి గల్లీలోనూ అంతర్గత రోడ్డు నిర్మాణం

10-11-2026 | 07:17pm

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 

ముకరంపుర, నవంబర్ 10 (విజయక్రాంతి): కరీంనగర్ నగర సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని.. ఈ ప్రయత్నానికి ప్రజలు సహకరించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి గల్లీలో అంతర్గత రోడ్డు లను ఏడాదిలోపు నిర్మించాలని నిర్ణయించామని వెల్లడించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో భాగంగా మంగళవారం 50వ డివిజన్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటించారు.

నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్  యాదిగిరి సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ లతో కలిసి జ్యోతినగర్ ప్రాంతంలో రూ: 79 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టిన ఆర్.సీ.సి డ్రైన్ మరియు స్లాబ్ కల్వర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, డివిజన్ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు