యాసంగిలో వరి సాగు వద్దు
జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్
మహబూబాబాద్ నవంబర్ 10 (విజయక్రాంతి): ఎల్ నినో నేపథ్యంలో(Background of El Niño) ఈ యాసంగి సీజన్లో(Yasangi Seasons) వరి సాగుకు(Paddy cultivation) బదులు ఆరుతడి పంటలు చేపట్టాలని, నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్(District Collector Sneha Sabarish) కోరారు. ఎల్ నినో, వర్షాభావ పరస్థితులలో ఉద్యాన, కూరగాయలు, ఆయిల్ పామ్, మల్బరీ సాగులో తీసుకోవలసిన మేలైన యాజమాన్య పద్దతులపై అవగాహన కార్యక్రమం గూడూరు మండలం భూపతిపేట రైతు వేదికలో నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఉద్యానవన పంటల అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొని క్షేత్రస్థాయిలో రైతులు పండిస్తున్న కూరగాయలు పంటలను పరిశీలించారు. అనంతరం భీముని జలపాతాన్ని సందర్శించి ఫారెస్ట్, రెవెన్యూ, సర్వే ల్యాండ్ అధికారులతో వివిధ అభివృద్ధి, భూ సమస్యలపై చర్చించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసి చేయూత పెన్షన్లను వెరిఫికేషన్లను పరిశీలించారు.