నిస్సహాయులకు ఉచిత న్యాయం అందించడమే న్యాయసేవల లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి సి.హెచ్. పంచాక్షరీ
భూపాలపల్లి (మొగుళ్లపల్లి), నవంబర్ 10 (విజయక్రాంతి): న్యాయం పొందలేని నిస్సహాయులకు ఉచితంగా, సత్వరంగా న్యాయం అందించడమే న్యాయసేవాధికార సంస్థల ముఖ్య ఉద్దేశ్యమని తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి సి.హెచ్. పంచాక్షరీ(Legal Services Authority Secretary CH Panchakshari) తెలిపారు. జాతీయ న్యాయసేవల దినోత్సవం, సురక్షిత్ బచ్పన్ అభియాన్లో భాగంగా మొగుళ్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, చిన్నారులు, వయోవృద్ధులు ఉచిత న్యాయ సహాయం పొందేందుకు అర్హులన్నారు. చిన్నారుల రక్షణ, పోక్సో, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, బాల కార్మిక చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి తాడూరి మహతి వైష్ణవి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి. అఖిల, సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరి, ఎస్సై ఎం. సురేష్, ఎంఈఓ కుమారస్వామి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.