నాయబ్ తహసిల్దార్ కు ఘనంగా సన్మానం
తాడ్వాయి,నవంబర్,10( విజయక్రాంతి ): తాడువాయిలో నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన నాయబ్ తాసిల్దార్ శృతికి(Nayab Tahsildar Shruti) తాడువాయి మండల అంబేద్కర్ సంఘం(Ambedkar Association of Taduwai Mandal) నాయకులు ఘనంగా సన్మానించారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండల కేంద్రంలోని తహాసిల్దార్ కార్యాలయంలో ఆమెకు మంగళవారం పుష్పగుచ్చం అందించి శాలువతో సత్కరించారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం నాయకులు మాట్లాడుతూ... మండలంలో తమ వంతు బాధ్యతను పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల ప్రధాన కార్యదర్శి గైని రాజలింగం,నాయకులు బదనకంటి సంతోష్, పులి ప్రభాకర్,గైని సంజీవ్,గడ్డం రవీందర్, సముద్రాల అఖిల్ తదితరులు పాల్గొన్నారు.