ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు 25 శాతం రాయితీ

10-11-2026 | 07:14pm

30లోగా పెండింగ్ ఫీజులు చెల్లించాలి..

జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా 

కరీంనగర్, నవంబరు 10 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం(Government of Telangana) కల్పించిన 25 శాతం రాయితీతో తమ స్థలాలను క్రమబద్ధీకరించుకు నేందుకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు(LRS applicants) మరో అవకాశం లభించిందని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా(LRS applicants) ఒక ప్రకటనలో తెలిపారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు(Applications) పరిష్కారం చూపడంతోపాటు, తక్కువ భారంతో ప్లాట్లను రెగ్యులరైజ్(Regularize) చేసుకునేందుకు ప్రభుత్వం కల్పించిన ఈ వెసులుబాటును అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోవాలని  సూచించారు.

ఈ నెల 30వ తేదీలోగా రాయితీ పోను మిగిలిన రెగ్యులరైజేషన్ ఫీజులను చెల్లించాలని స్పష్టం చేశారు. గ్రామాల వారీగా పెండింగ్ దరఖాస్తులు, ఫీజుల చెల్లింపు వివరాలను పరిశీలించి, గడువులోగా ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని డీపీఓను ఆదేశించారు. జిల్లాలో ఎల్ఆర్ఎస్–2020 కింద ఇప్పటివరకు మొత్తం 71,454 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఈ నెల 10 నాటికి  జిల్లాలో మొత్తం 11,514 దరఖాస్తులు ఆమోదం పొందినట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

పెండింగ్ ఫీజుల వసూళ్లపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల వారీగా దరఖాస్తుదారుల వివరాలను సేకరించి, వ్యక్తిగతంగా సమాచారం అందించాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా అర్హులైన దరఖాస్తుదారులు ప్రభుత్వం కల్పించిన 25 శాతం రాయితీని వినియోగించుకుని, మిగిలిన ఫీజులను ఈ నెల 30లోగా చెల్లించి తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు