పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి, నవంబర్ 10 (విజయక్రాంతి): పీఎం శ్రీ, సమగ్ర శిక్ష పథకాల కింద జిల్లాలో చేపట్టిన పాఠశాలల అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో విద్యాశాఖ, టీజీడబ్ల్యూఈఐడీసీ అధికారులతో పనులు, నిధుల వినియోగంపై సమీక్షించారు. పీఎం శ్రీ కింద ఎంపికైన 8 పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్లు, డిజిటల్ తరగతి గదులు, మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయాలని సూచించారు. పెండింగ్ బిల్లులను వెంటనే పరిష్కరించి, కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ లలిత, టీజీడబ్ల్యూఈఐడీసీ డీఈ జీవన్ తదితరులు పాల్గొన్నారు.