బట్టలు ఆరేస్తూ భవనంపై నుండి పడి వివాహిత మృతి
కరీంనగర్ క్రైం, నవంబర్9 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని(Karimnagar town) విద్యానగర్ లో ఒక వివాహిత సోమవారం ఉదయం బంగ్లాపైన బట్టలు ఆరేస్తూ ప్రమాదవశాత్తు(Accidentally) జారిపడి మృతి(Death) చెందింది. టూ టౌన్ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.విద్యానగర్ కు చెందిన మేడి.శైలజ(41) పిల్లలతో కలిసి తన తండ్రి ఇంట్లో ఉంటుంది.ఆమె భర్త రాజేష్ మహారాష్ట్ర లో మైనింగ్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు.ఒక కొడుకు కూతురు ఉన్నారు.
సోమవారం ఇంట్లో బట్టలు అరెసేందుకు బాల్కానీలో ఉండగా ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయింది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన శైలజను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబసభ్యుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి తెలిపారు.