మండల స్థాయి పాఠశాలల నృత్య పోటీలు

26-11-2026 | 10:55pm

ఎర్రుపాలెం నవంబర్ 26 ( విజయక్రాంతి): మండల పరిధిలోని బనిగండ్లపాడు శీలం రామ్మోహన్ రెడ్డి మెమోరియల్(Seelam Rammohan Reddy Memorial) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం జే.ఎన్.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రూప్  క్లాసికల్ డాన్స్,సోలో డాన్స్ , జానపద గ్రూప్ డాన్స్, సోలో డాన్స్ , గ్రూప్ ఫోక్ డాన్స్, సోలో డాన్స్ , సాంగ్స్ పోటీలు హోరా హోరీగా కొనసాగాయి. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు  రంగారెడ్డి, జే.ఎన్ఆర్ ఫౌండేషన్ అధినేత  జంగా గుర్నాథ్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.

ఈ పోటీలు 13 పాఠశాల నుండి  250 మంది కళాకారులు పాల్గొన్నారు. జానపద నృత్య పోటీల్లో ప్రధమ బహుమతి శ్రీ భాస్కర మీనవోలు, ద్వితీయ బహుమతి, ఎస్.ఆర్.ఎమ్.ఎమ్ జి. హెచ్.ఎస్ బనిగండ్లపాడు  తృతీయ బహుమతి సెంట్ విన్సెంట్ పాఠశాల ఎర్రుపాలెం , చతుర్ధ బహుమతి కస్తూరిబా పాఠశాల ఎర్రుపాలెం ,క్లాసికల్  డాన్స్ పోటీల్లో ప్రథమ బహుమతి కస్తూరిబా పాఠశాల,ద్వితీయ బహుమతి ఎస్.ఆర్.ఎమ్.ఎమ్ జి.హెచ్.ఎస్ బనిగండ్లపాడు,

తృతీయ బహుమతి సెంట్ విన్సెంట్ పాఠశాల ఎర్రుపాలెం  చతుర్థి బహుమతి శ్రీ భాస్కర మేనవోలు,సాంగ్స్ పోటీల్లో ప్రధమ బహుమతి హేమలత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎర్రుపాలెం,ద్వితీయ బహుమతి లాస్యప్రియ గురుకుల పాఠశాలఎర్రుపాలెం,తృతీయ బహుమతి  విష్ణు ప్రియ శ్రీ భాస్కర మీనవోలు,చతుర్ధ బహుమతి లీలా భవాని కస్తూరిబా పాఠశాల, ఫోక్స్ డాన్స్ పోటీల్లో ప్రథమ బహుమతి  దేవాన్షి వివేకానంద స్కూల్ బనిగండ్లపాడు,

ద్వితీయ బహుమతి  జెస్సీ కస్తూరిబా పాఠశాల, తృతీయ బహుమతి ఎస్.ఆర్.ఎమ్.ఎమ్ జి. హెచ్.ఎస్ బనిగండ్లపాడు, చతుర్ద బహుమతి శ్రీ భాస్కర స్కూల్ మేనవోలు గెలుపొందాయి. ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు   ఫీల్డ్  తో పాటు సర్టిఫికెట్స్ ను సర్పంచ్ బలుసుపాటి జయరాజు, జేఎన్ఆర్ ఫౌండేషన్ అధినేత జంగా గుర్నాథ్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రంగారెడ్డి, పెద్ద గోపవరం సొసైటీ అధ్యక్షులు శీలం అక్కిరెడ్డి చేతుల మీదుగా  అందజేశారు.

ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థులకి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ వేమిరెడ్డి రామిరెడ్డి, జె.ఎన్.ఆర్ ఫౌండేషన్ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు,నాయ నిర్ణయితలు గా కళాసాధన నృత్య  కళానికేతన్  కళ్యాణపు నాగరాజు, కళ్యాణపు సింధు, చొప్పవరపు దివ్య వ్యవహరించారు.

మరిన్ని వార్తలు