జమ్మి పూజలో డిప్యూటీ సీఎం భట్టి

21-10-2026 | 11:15am

మధిర, అక్టోబర్ 21 (విజయక్రాంతి): మధిర పట్టణంలోని బంజారా కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దసరా వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొని సంప్రదాయబద్ధంగా జమ్మి పూజ (Jammi Puja) నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆలయ మండపంలో వేద పండితులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వేద ఆశీర్వచనం (Vedic Blessings) అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. పూజల అనంతరం పలువురు భట్టి విక్రమార్కకు జమ్మి ఆకులు అందజేసి దసరా శుభాకాంక్షలు తెలిపారు.

దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగ వేడుకలతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో మధిర పట్టణ ప్రజలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు