రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఎల్లారెడ్డి, నవంబర్ 14 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో జరిగిన Road Accidentలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా రహదారిపై నిలిపి ఉంచిన లారీని ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మాచాపూర్ గ్రామానికి చెందిన మాధపోయిన పరమేష్ (35) శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఎల్లారెడ్డి నుంచి తన గ్రామానికి బయలుదేరాడు.
మార్గమధ్యంలోని మల్లయ్యపల్లి గేట్ సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని గుర్తించలేక బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పరమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానికులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడు పరమేష్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.