ఘనంగా సదర్ ఉత్సవాలు

14-11-2026 | 10:43am

గండీడ్,విజయక్రాంతి: మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి, సదర్ ఉత్సవాలను(Sadar Utsavs) యాదవ సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగుల అనంతలక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదవ సోదరులు దున్నపోతులను అలంకరించి గ్రామ వీధుల్లో ఘనంగా ఊరేగించారు. నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఉత్సవాలకు శోభ తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఆర్.భవంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ గొల్ల సత్యమ్మ సాయిలు, ఉపసర్పంచ్ పారిజాత శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు పిట్ల నారాయణ, సన్రైజ్ ఆంజనేయ, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజుల కృష్ణయ్య, బేస్ కృష్ణారెడ్డి, గచ్చుమల్లె భగవంత్ రెడ్డి, జి.మాధవరెడ్డి,చిట్లపల్లి బాలయ్య, గ్రామ యాదవ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు