జీళ్లచెరువు ఆలయంలో వైభవంగా శమీపూజ

21-10-2026 | 11:31am

కూసుమంచి, అక్టోబర్ 21 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో చిన్న తిరుపతిగా పేరుగాంచిన జీళ్లచెరువు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో విజయదశమి సందర్భంగా శమీపూజ (Shami Puja) కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ అంబాల లింగయ్య, ఈవో జగన్ మోహన్ రావు ఆధ్వర్యంలో అర్చకులు చిలకమర్రి హేమంతాచార్యులు, జనార్దనాచార్యులు, కిరణాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శమి, జమ్మిచెట్లకు పూజలు చేసి సంప్రదాయాన్ని పాటించారు.

దసరా పర్వదినం కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. జమ్మిచెట్టుకు పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మంత్రి పొంగులేటి పేరుతో ప్రత్యేక పూజలు

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరి దయాకర్ రెడ్డి, కూసుమంచి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బజ్జూరి వెంకట్ రెడ్డి పేరుతో స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా సందర్భంగా ఆలయంలో శమీపూజ చేసి స్వామివారి ఆశీస్సులు కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంబాల లింగయ్య, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొక్క ఉపేందర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కొండా శ్రీనివాసరావు, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు బెజవాడ శ్రీకాంత్, సీనియర్ జర్నలిస్ట్ పెండ్ర అంజయ్య, బాలబోయిన రమేష్, బాలబోయిన శ్రీనివాస్, దేవాదాయ శాఖ జూనియర్ అసిస్టెంట్ మురళీ తదితరులు పాల్గొన్నారు.

ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తున్న మంత్రికి కృతజ్ఞతలు

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి, గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జిలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మంత్రి సహకారంతో ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు