రఘునాథగూడెంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం

20-11-2026 | 08:41pm

పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా – ప్రజాప్రతినిధులు

కల్లూరు, నవంబర్ 20 (విజయక్రాంతి): పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా(Financial Security) కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని(Indiramma Life Insurance Scheme) రఘునాథగూడెం గ్రామంలో(Raghunathagudem Village) ప్రారంభించారు. సర్పంచ్ కుక్కా సుధారాణి రానా అధ్యక్షతన ప్రత్యేక అధికారి అశోక రాణి, తహసీల్దార్ బ్రహ్మేశ్వరరావు కలిసి పథకాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను(government welfare schemes) సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జీవిత బీమా పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు దోహదపడుతుందని తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలకు పథకం ప్రయోజనాలను వివరించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోట్రు అర్జున్‌రావు, ఆర్‌ఐ ప్రసన్నకుమార్, గ్రామ పెద్దలు కుక్కా రానా, కర్నాటి రామకృష్ణారెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, జీపీ ఓ రాంబాయి, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు