రాజాపూర్ విద్యార్థుల విజ్ఞాన యాత్ర
జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థలో 80 మంది విద్యార్థుల సందడి.
ఔషధ మొక్కలు, నూతన వంగడాలు, జీవవైవిధ్య ఉద్యానవనంపై ప్రత్యక్ష అవగాహన.
రాజాపూర్ నవంబర్ 20: కృత్రిమ మేధస్సుతో (Artificial Intelligence) వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులపై విద్యార్థులకు వ్యవసాయంపై నూతన వంగడాల అభివృద్ధి కోసం విద్యార్థులకు విజ్ఞాన విధాన యాత్ర ఎంతో మేలు కలుగుతుందని రాజాపూర్ పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయులు సయ్యద్ ఇబ్రహీం అన్నారు. శుక్రవారం ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో విద్యార్థులు హైదరాబాద్లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థను( National Agricultural Research Institute) సందర్శించారు.
పాఠశాలలో వ్యవసాయ వృత్తి విద్య, సమాచార సాంకేతిక పరిజ్ఞాన వృత్తి విద్య అభ్యసిస్తున్న మొత్తం 80 మంది విద్యార్థులు ఈ క్షేత్ర పర్యటనలో పాల్గొన్నారు. వ్యవసాయ పరిశోధనా రంగంలో జరుగుతున్న నూతన ఆవిష్కరణలు, ఆధునిక విధానాలను తెలుసుకుంటూ విజ్ఞానాన్ని పెంపొందించుకున్నారు.
పరిశోధన క్షేత్రంలో వివిధ రకాల ఔషధ మొక్కలను విద్యార్థులు ఆసక్తిగా పరిశీలించారు. వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన నూతన పంట వంగడాల గురించి తెలుసుకున్నారు.సంస్థ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖిలో పాల్గొన్నారు.ఈ విజ్ఞాన పర్యటనలో ఉపాధ్యాయులు శ్యాంసుందర్, ఎల్లయ్య, మోసజెస్, తిరుపతమ్మ, అరుంధతి, వెంకటమ్మ, జ్యోతి, ప్రకాష్ పాల్గొన్నారు.