పల్లె బడుల్లో వికసించిన విజ్ఞాన కుసుమాలు!

20-11-2026 | 08:33pm

* జీనియస్‌ క్వెస్ట్‌లో ముగ్గురు విద్యార్థుల ప్రతిభ

* జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక

పాపన్నపేట,నవంబరు20: పల్లె బడుల్లోనూ ప్రతిభకు కొదవలేదని, సరైన వేదిక లభిస్తే గ్రామీణ విద్యార్థులు(Rural students) సైతం తమ మేధస్సుతో మెరవగలరని పాపన్నపేట మండల(Papannapet Mandal) విద్యార్థులు(students) నిరూపించారు. మెదక్‌ జీనియస్‌ క్వెస్ట్‌(Medak Genius Quest)–2026 మండల స్థాయి క్విజ్‌ పోటీల్లో(Quiz Competition) ముగ్గురు విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారి విజయంతో ఆయా పాఠశాలల్లో ఆనందం వెల్లివిరిసింది.

మండల కేంద్రమైన పాపన్నపేట ఉన్నత పాఠశాలలో(Papannapet High School) శుక్రవారం ఎంఈఓ ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన ఈ పోటీలు నిర్వహించారు. క్విజ్‌ ఇన్‌చార్జి, పాపన్నపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహేశ్వర్‌ పర్యవేక్షణలో జరిగిన పోటీల్లో మండలంలోని 11 ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ తమలోని జ్ఞానాన్ని, ఆలోచనా శక్తిని ప్రదర్శించారు.

పోటీల్లో పదో తరగతి విభాగంలో యూసుఫ్‌పేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన నేహా, తొమ్మిదో తరగతి విభాగంలో కొడపాక ఉన్నత పాఠశాలకు చెందిన అశ్రుత్‌, 8వ తరగతి విభాగంలో మల్లంపేట ఉన్నత పాఠశాలకు చెందిన మచ్చేందర్‌ విజేతలుగా నిలిచారు. జిల్లా స్థాయి పోటీలకు ఎంపికై తమ పాఠశాలల కీర్తిని చాటారు. ఈ కార్యక్రమంలో క్విజ్‌ మాస్టర్లు, టెక్నికల్‌ సపోర్ట్‌ టీమ్‌ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు