కార్తీక మాసంలో సాయిబాబాకు ప్రత్యేక పూజలు.. భక్తులకు అన్నదానం
కుటుంబ సమేతంగా పూజల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్
కల్లూరు,(విజయక్రాంతి): పవిత్ర కార్తీక మాసా(Karthika Masam)న్ని పురస్కరించుకుని కల్లూరు పట్టణంలోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం(Sri Shirdi Saibaba Temple)లో మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చైర్మన్ దంపతులకు స్వాగతం పలికి ప్రత్యేక అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం చైర్మన్ ఆధ్వర్యంలో ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
స్వయంగా భక్తులకు అన్నప్రసాదం వడ్డించి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ శీలం కోటేశ్వరి, కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ సాయి కృష్ణారెడ్డి, మేనేజర్ నందిశెట్టి నాగేశ్వరరావు, వార్డు ఆఫీసర్ సరోజిని, కౌన్సిలర్లు గుండ్ల పుల్లారావు, యాస నాగమణి శ్రీకాంత్, ఉబ్బన్న రాంబాబు, కృష్ణంశెట్టి లక్ష్మీకొండలు, జిల్లెల్ల స్వాతి భాస్కర్‌రెడ్డి, భూక్య రాంబాయి, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.