పేదోడి సొంతింటి కలకు సాకారం
సిరికొండలో నూతన చేయూత పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాల అందజేత
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు కీసర సంతోష్‌రెడ్డి శంకుస్థాపన
మోతె,(విజయక్రాంతి): పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు చేరుతున్నాయి. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి(MLA Uttam Padmavati Reddy) సహకారంతో సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని సిరికొండ గ్రామం(Sirikonda village)లో నూతనంగా చేయూత పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా నూతన పింఛన్ లబ్ధిదారులకు ఎంపీడీవో సందీప్ కుమార్, కీసర సంతోష్‌రెడ్డి మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు కీసర సంతోష్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.
పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారని నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ బొర్రా వెంకటేష్, ఉపసర్పంచ్ రావుల రాజీవ్, గ్రామ కార్యదర్శి, గ్రామ శాఖ అధ్యక్షుడు నందిగామ కృష్ణారెడ్డి, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, నూతన పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.