రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి ఖమ్మం కాంగ్రెస్

26-11-2026 | 11:50am

సత్తుపల్లి, నవంబర్ 26 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా ఏఐసీసీ (AICC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సంవిధాన్ రక్షక్’ కార్యక్రమంలో భాగంగా టీపీసీసీ ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్‌లో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ (Constitution Protection Rally) నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌కు బయలుదేరారు.

హైదరాబాద్‌లోని లిబర్టీ సర్కిల్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. రాజ్యాంగ పరిరక్షణ, విలువల (Constitutional Values) సంరక్షణ లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లాయి.

ఈ సందర్భంగా వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాపా సుధాకర్ హైదరాబాద్‌కు బయలుదేరారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ కాంగ్రెస్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు