నేడు హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ ర్యాలీ
హైదరాబాద్: రాజ్యాంగ దినోత్సవాన్ని(Constitution Day) పురస్కరించుకుని తెలంగాణ కాంగ్రెస్ భారీ ర్యాలీ(Telangana Congress Rally)కి సిద్ధమైంది. ఏఐసీసీ పిలుపు మేరకు 'సంవిధాన్ రక్షక్ మార్చ్'( Samvidhan Raksha March) పేరుతో గురువారం హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఈ మార్చ్ చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఉదయం 10.30 గంటలకు ట్యాంక్‌బండ్‌పై ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ర్యాలీ ప్రారంభం కానుంది. అక్కడి నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొనసాగనుంది.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి బీఎం సందీప్ కుమార్(AICC Telangana in-charge BM Sandeep Kumar), టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు కూడా మార్చ్‌లో భాగస్వాములు కానున్నారు.
ర్యాలీని విజయవంతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పీసీసీ నాయకత్వం పిలుపునిచ్చింది. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.