ఎల్బీ తండాలో పలు భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
దామరచర్ల, నవంబర్ 26 (విజయక్రాంతి): దామరచర్ల మండలం లావుడి భిక్యా తండాలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనం, మహిళా సంఘం భవనం, ఇందిరమ్మ ఇళ్లను గురువారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం గ్రామ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన నూతన భవనాలను (Buildings) పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల (Infrastructure) కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. మహిళా సంఘాల బలోపేతం, పేదల సొంతింటి కల నెరవేర్చడం లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. అందులో భాగంగానే ఈ నిర్మాణాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.