విద్యార్థులకు పోలీస్ శాఖపై అవగాహన
28-10-2026 | 08:46pm
ఆసిఫాబాద్ (విజయక్రాంతి):పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ నితికా పంత్(District SP Nitika Pant) ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ విధులు, కేసుల దర్యాప్తు, కమ్యూనికేషన్ వ్యవస్థ, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ పనితీరును వివరించారు.
నార్కోటిక్ డాగ్‌లతో మాదకద్రవ్యాల గుర్తింపుపై ప్రదర్శన నిర్వహించి, అత్యవసర సమయాల్లో పోలీసుల సహాయం తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో అడ్మిన్ ఆర్‌ఐ, కెరమెరి ఎస్‌ఐ రాజు, పోలీస్ సిబ్బంది, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.