ముదిగుంట గ్రామానికి ప్రశంసల వెల్లువ

28-10-2026 | 08:45pm

జైపూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామం(Mudigunta Village) జల సంరక్షణలో ఆదర్శంగా నిలుస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతలు, పైకప్పులపై వర్షపు నీటి సేకరణ, బోర్‌వెల్‌ పునర్భరణ, చెరువుల పూడికతీత, కొత్త ఊటకుంటల నిర్మాణంతో భూగర్భ జలాల పెంపునకు సర్పంచ్ ఆకుల రవి చేపడుతున్న చర్యలను పంచాయతీరాజ్ కమిషనర్ దివ్యా దేవరాజన్(Panchayati Raj Commissioner Divya Devarajan) వీడియో కాన్ఫరెన్స్‌లో అభినందించారు.

ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ‘మన్ కీ బాత్‌’లోనూ ప్రస్తావనకు వచ్చిన ముదిగుంట గ్రామం జల సంరక్షణలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమని ఆమె హర్షం వ్యక్తం చేశారు. త్వరలో గ్రామాన్ని సందర్శిస్తానని ప్రకటించారు. ఈ సమావేశంలో ఏసీఎల్‌బీ చంద్రయ్య, డీఆర్‌డీఓ కిషన్, సీఈఓ గణపతి, ఇంజినీరింగ్, ఆర్‌డబ్ల్యూఎస్, వ్యవసాయ శాఖ అధికారులు, జైపూర్ ఎంపీడీఓ, శ్రీపతి బాపురావు, ముదిగుంట పంచాయతీ కార్యదర్శి సురేష్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు