రెండున్నర లీటర్ల నాటుసారా పట్టివేత

28-10-2026 | 08:49pm

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) రామారెడ్డి మండలం కన్నాపూర్ రోడ్డు వద్ద జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వి. శ్రీనివాసులు(Excise Task Force Inspector V. Srinivasulu)  ఆధ్వర్యంలో బుధవారం వాహనాల తనిఖీ చేస్తుండగా  కన్నాపూర్ రామారెడ్డి రోడ్డు వద్ద గల సాయిలు పౌల్ట్రీ ఫారం వద్ద కన్నా పూర్ తండాకు చెందిన కాట్రోత్ మహిపాల్  టీవీఎస్ బైక్ పై రెండున్నర లీటర్ల నాటు సారా రవాణా(Illicit Liquor Transport) చేస్తుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. అతన్ని అరెస్టు చేసి అతని వద్ద నుండి నాటు సారాను,  టీవీఎస్ బైకును జప్తు చేసి స్టేషన్కు  తరలించినట్లు ఎక్సైజ్ సూపర్డెంట్ ముకుంద రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎం శంకర్, అమృత రెడ్డి ,రాజు, మహిళా కానిస్టేబుల్ శిరీష లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు