సరస్వతీ స్వరూపిణిగా మర్పడగ విజయదుర్గ
శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక అలంకరణ.. భక్తులకు దివ్యమంగళ దర్శనం
కొండపాక, అక్టోబరు 16:( విజయ క్రాంతి ): కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు(Sharannavarathri Celebrations) వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు సరస్వతీ స్వరూపిణిగా భక్తులకు దివ్యమంగళ స్వరూపంలో దర్శనమిచ్చారు. జ్ఞానప్రదాయినిగా, విద్యలకు అధిష్ఠాన దేవతగా పూజలందుకునే సరస్వతీ దేవి అలంకరణలో విజయదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.
క్షేత్ర నిర్వాహకులు డాక్టర్ చెప్పేల హరినాథ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. శరన్నవరాత్రి ఉత్సవాలతో క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.