ప్రకృతి పర్యాటకానికి ఎంపీ చేయూత

13-11-2026 | 02:00pm
  1. ఖమ్మం శ్రీనివాసగిరికి రూ.50 లక్షలు ఎంపీ చేయూత
  2. ఎకో టూరిజం అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్‌ నిధుల కేటాయింపు
  3. పాల్వంచలోని శ్రీనివాసగిరి ఈస్ట్ బీట్ లో కిలోమీటరు మేర ఫుట్‌పాత్‌లు, నడకదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు 

ఖమ్మం, నవంబర్ 12(విజయంక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీనివాసగిరిని ప్రకృతి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి(MP Ramasahayam Raghuram Reddy) ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఎకో టూరిజం అభివృద్ధికి తన ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయించారు.

ఈ మేరకు 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండు అభివృద్ధి పనులకు రూ.25 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తూ..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు అందజేశారు.

రెండు కిలోమీటర్ల మేర పనులు

పాల్వంచ మండలంలోని శ్రీనివాసగిరి ఈస్ట్ బీట్ ప్రాంతంలో రెండు కిలోమీటర్ల మేరకు ఫుట్‌పాత్‌లు, పాదచారుల నడకదారుల నిర్మాణానికి ఈ నిధులను వినియోగించనున్నారు. ప్రకృతి అందాల నడుమ ఆధ్యాత్మికతను పర్యాటకంతో అనుసంధానిస్తూ శ్రీనివాసగిరిని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈ ప్రతిపాదనలు రూపొందించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పర్యాటక శాఖ అధికారుల సహకారంతో ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.

ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తొలి అడుగు పడనుంది. శ్రీనివాసగిరి ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరిగేలా, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు అనువైన వసతులు కల్పించేందుకు ఈ పనులు దోహద పడనుండడంతో.. ఎంపీ రఘురాం రెడ్డికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు