తిరుమలాయపాలెం నూతన ఎస్సై
పోగుల సురేష్ బాధ్యతల స్వీకరణ
తిరుమలాయపాలెం, అక్టోబర్ 14 (విజయ క్రాంతి): తిరుమలాయపాలెం పోలీస్స్టేషన్(Tirumalayapalem Police Station) నూతన ఎస్సైగా పోగుల సురేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏడూళ్ల బయ్యారం పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఆయన బదిలీపై తిరుమలాయపాలెంకు వచ్చారు. ఈ సందర్భంగా పోలీస్స్టేషన్లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
మండల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంపై దృష్టి సారించనున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని నూతన ఎస్సైను మండల ప్రజలు ఆశిస్తున్నారు.